ETV Bharat / state

ఇంటింటికీ తాగునీరు ఇవ్వకుంటే మంత్రి అనిల్ ఇళ్లు ముట్టడిస్తాం: కోటంరెడ్డి - ఇంటింటికీ మంచినీరు ఇవ్వకుంటే మంత్రి అనిల్ ఇళ్లు ముట్టడిస్తాం : కోటంరెడ్డి

నెల్లూరులో ఇంటింటికి మంచి నీరు అందించకుంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ నివాసాన్ని ముట్టడిస్తామని నగర తెదేపా ఇన్​చార్జ్​ కోటంరెడ్డి హెచ్చరించారు. వైకాపా ప్రజాప్రతినిధులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని సూచించారు.

వైకాపా ప్రజాప్రతినిధులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది : కోటంరెడ్డి

author img

By

Published : Jun 19, 2021, 9:02 PM IST

తెదేపా ప్రారంభించిన ప‌నులు పూర్తి చేయక‌పోతే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ నివాసాన్ని ముట్ట‌డిస్తామని నెల్లూరు నగర ఇన్​చార్జ్​ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి హెచ్చరించారు. అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నుల‌ను పూర్తి చేసి ఇంటింటికీ బ్లూ ట్యాప్​లో నీరు వ‌చ్చేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

'మంత్రి అనిల్ ఆపేశారు'

నెల్లూరు వాసుల చిర‌కాల స్వప్నం తీర్చేందుకు మంత్రి నారాయ‌ణ హ‌యాంలో తీసుకొచ్చిన భూ గర్భ డ్రైనేజీ, మంచినీటి ప‌థ‌కాన్ని మంత్రి అనిల్ ఆపేశారని ఆరోపించారు. తమ హయాంలో 86 శాతం భూగర్భ డ్రైనేజీ ప‌నులు, 96 శాతం తాగునీటి ప‌థ‌కం ప‌నులు పూర్తి చేస్తే వాటిని వైసీపీ సర్కార్ క‌క్ష‌తో నిలిపివేసిందని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ప్ర‌జ‌లు నిల‌దీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప‌నులు ఎప్పుటిలోగా పూర్తి చేస్తారో ప్రశ్నించాలని సూచించారు.

ఇవీ చూడండి : Capital Protest : అమరావతి పోరుకు 550 రోజులు..ఏ రోజు ఏం జరిగిందంటే !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.