నెల్లూరు నగరంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని అల్లరిమూకలు అవమానపరిచాయి. కళ్ల జోడు తీసేసి, రంగులు చల్లారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు విగ్రహాన్ని శుభ్రం చేసి, పాలతో అభిషేకించారు.
మహాత్ముడి విగ్రహానికి కళ్ళజోడు, చేతి కర్రను తిరిగి అమర్చారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. జాతీయ నాయకుల విగ్రహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి:
విశాఖ గ్యాస్ లీక్: నివేదిక సమర్పణకు కమిటీకి జూన్ 30 వరకు గడువు