ETV Bharat / state

వినాయక మండపం వద్ద వివాదం... కర్రలు, రాళ్లతో దాడి చేసిన అల్లరిమూకలు - nellore district clashes news

నెల్లూరు జిల్లా అంబాపురంలో వినాయక మండపం వద్ద వివాదం జరిగింది. స్థానికి గిరిజన కాలనీలో విగ్రహం ఏర్పాటు చేసుకున్న గిరిజనుల వద్దకు వచ్చిన అల్లరిమూకలు సినిమా పాటలు పెట్టాలంటూ ఘర్షణకు దిగారు. స్థానికులు అడ్డు చెప్పటంతో వారిపై దాడిచేసి.. అక్కడ్నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

clash
వివాదం
author img

By

Published : Sep 12, 2021, 9:47 PM IST

నెల్లూరు రూరల్ మండలం అంబాపురం వద్ద ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. స్థానిక గిరిజన కాలనీలో వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకున్న గిరిజనులు భక్తిపాటలు పెట్టుకుని భజనలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో కొంతమంది అల్లరిమూకలు వినాయక మండపం వద్దకు వచ్చి సినిమా పాటలు పెట్టాలంటూ గందరగోళం సృష్టించారు. అందుకు స్థానికులు అంగీకరించకపోవడంతో వారితో ఘర్షణకు దిగారు. కర్రలు, రాళ్లతో స్థానికులపై దాడికి పాల్పడి.. మైక్ సెట్​ను విరగొట్టి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. గొడవకు కారణమైన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి

జగనన్న పక్కా ఇళ్లకు వైకాపా రంగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.