ETV Bharat / state

వినాయకచవితి రోజునే.. ప్రముఖ ఆలయంలో గణేశుడి విగ్రహం చోరీ - someshwara temple news

నెల్లూరు జిల్లాలో దుండగులు బరితెగించారు. అనంతసాగరం మండలం సోమశిలలోని ప్రముఖ సోమేశ్వర ఆలయంలోని పురాతన వినాయక రాతి విగ్రహాన్ని పట్టపగలే చోరీ చేశారు. వినాయకచవితి రోజు ఈ ఘటన జరగటం భక్తులకు ఆవేదన కలిగించింది.

The ancient stone idol of Vinayaka in Someshwara temple in Somashila was stolen

author img

By

Published : Aug 22, 2020, 4:39 PM IST

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిలలోని ప్రముఖ సోమేశ్వర ఆలయంలోని పురాతన వినాయక రాతి విగ్రహం చోరీకి గురైంది. సినీ ఫక్కీలో పట్టపగలు చోరీ చేశారు దుండగులు.

ఇదీ జరిగింది

సోమేశ్వర ఆలయానికి శనివారం ఉదయం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వెళ్లారు. ఆ సమయంలో ఆలయ అర్చకులు పూజా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. కాసేపటి తరువాత ఆలయంలో కుడి వైపున ప్రతిష్ఠించి ఉన్న వినాయక రాతి విగ్రహం మాయమైనట్లు పూజారులు గుర్తించారు. ఆ ముగ్గురు కనిపించకపోయేసరికి వారే చోరీ చేసినట్లు అర్చకులు గ్రహించి సమాచారాన్ని ఆలయ ధర్మకర్త విజయకుమార్​కు తెలియజేశారు. ఆయన సోమశిల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్​ఐ సుబ్బారావు ఆలయాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. చోరీకి గురైన విగ్రహం చోళుల కాలం నాటిది కావటంతో... రాతి విగ్రహంలో విలువైన వజ్రాలు దాచి ఉంటారన్న అభిప్రాయంతోనే చోరీ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వినాయకచవితి రోజు ఈ ఘటన జరగటం భక్తులకు తీరని ఆవేదన మిగిల్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.