నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 108, 104 వాహనాలను మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. సామాన్యులకు సేవలు అందించడానికి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. దేశంలోనే ఇది ఒక రికార్డు అని ఆయన తెలిపారు. 1068 (108,104) వాహనాలను ప్రారంభించడం అద్భుతమని పేర్కొన్నారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం జగన్ నడస్తూ.. ప్రజలకు అండగా ఉంటున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. గ్రామీణ రహదారులకు మహర్దశ.. ఎన్‌డీబీ పనుల్లో కదలిక