Tension at Sultan Shaheed Dargah: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సుల్తాన్ షహీద్ దర్గా ఆధీనంలో వున్న వక్ఫ్ బోర్డు గదులకు తాళాలు వేయడానికి వచ్చిన మున్సిపల్ అధికారులను స్థానికులు అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వక్ఫ్ బోర్డు ఆధీనంలో సుమారు 64 గదులు ఉన్నాయి. కొంతమంది స్థానికులు ఆ రూములను బాడుగకు తీసుకుని.. వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రతినెల వక్ఫ్ బోర్డుకు అద్దె చెల్లిస్తున్నారు. వక్ఫ్ బోర్డు వారు మున్సిపల్ అధికారులకు పన్నులు చెల్లిస్తూ వస్తున్నారు.
అయితే గత ఆరు సంవత్సరాల నుండి మున్సిపల్ శాఖకు వక్ఫ్ బోర్డు పన్నులు చెల్లించటం ఆపివేయడంతో.. ఎటువంటి నోటిసులు ఇవ్వకుండా వక్ఫ్ బోర్డు రూములకు తాళాలు వేయటానికి వచ్చారు. దీంతో స్థానికులు వారిని అడ్డుకున్నారు. మున్సిపాలిటీ అధికారులకు నోటిసులిచ్చి వసూలు చేసుకోవాలి గానీ.. ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ప్రతినెలా అద్దె చెల్లిస్తున్నప్పటికీ వక్ఫ్ బోర్డు వారు... మున్సిపల్ అధికారులకు చెల్లించడం లేదని తెలిపారు.
ఇదీ చదవండి:
CM Jagan slams Opposition Parties: 'ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తే ప్రతిపక్షాలకు పండుగే'