ETV Bharat / state

KRMB: కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ.. వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై అభ్యంతరం

KRMB
KRMB
author img

By

Published : Aug 23, 2021, 6:42 PM IST

Updated : Aug 23, 2021, 7:27 PM IST

18:40 August 23

ts enc letter to krmb

కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ  రాశారు. తాగునీటి కోసం వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని కోరారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతంగానే లెక్కించాలని లేఖలో ప్రస్తావించారు. వెలిగొండ ప్రాజెక్టును ఏపీ అక్రమంగా నిర్మిస్తోందని పేర్కొన్నారు.  ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలని విజ్ఞప్తి చేశారు. 

విద్యుత్​ ఉత్పత్తి ఆపాలని ఏపీ ఫిర్యాదు

కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొద్దిరోజులుగా నడుస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ విద్యుత్ ఉత్పాదనపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి ఏపీ జలవనరుల శాఖ ఇంజినీరింగ్ చీఫ్‌ లేఖ రాశారు. అవసరం లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయటం వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటిమట్టం 854 అడుగులకు చేరితే రాయలసీమకు నీరివ్వలేమని ఈఎన్‌సీ పేర్కొన్నారు. తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి కూడా తాగునీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. విద్యుత్ ఉత్పాదన ద్వారా విడుదలవుతున్న నీటిని నాగార్జునసాగర్​లో నిలిపే అవకాశం లేదని వివరించారు. ఫలితంగా విలువైన జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పాదనను తక్షణమే నిలిపి వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కేఆర్ఎంబీని కోరారు.  

ఈనెల 27న కేఆర్​ఎంబీ సమావేశం

 రెండు తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల పంపకం సహా కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ కార్యాచరణపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27న సమావేశం కానుంది. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి రాయిపురే... రెండు రాష్ట్రాలకు నోటీసు ఇచ్చారు. 27న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ 14వ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశ ప్రతిపాదిత ఎజెండాను నోటీసుతో పాటు జతపర్చారు.

నీటి వాటాలపై చర్చ

ఇప్పటి వరకు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో వినియోగించుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి చెరిసగం నీటిని వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బోర్డుకు లేఖ రాసింది. దీంతో 2021-22 సంవత్సరంలో కృష్ణ జలాల వినియోగంపై బోర్డు సమావేశంలో చర్చించనున్నారు. తమ వాటాలో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ దీన్ని వ్యతిరేకిస్తోంది. బోర్డు సూచనలతో రెండు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. తెలంగాణ అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ అంశంపై సమావేశంలో మరోమారు చర్చ జరగనుంది.  

ఫిర్యాదులపై చర్చ

ఇటీవల ప్రాజెక్టులు నిండినపుడు రెండు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి చేశాయి. అందుకు ఉపయోగించిన నీటిని లెక్కల్లోకి తీసుకురావాలా వద్దా అన్న విషయమై చర్చించనున్నారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో బోర్డు పరిధి, నిర్వహణ, అమలు కార్యాచరణ, సంబంధిత అంశాలపై బోర్డులో చర్చిస్తారు. కొత్త ప్రాజెక్టులకు ఆర్నెళ్లలో అనుమతులు తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తారు. జూన్ నెలలో శ్రీశైలం సహా ఇతర చోట్ల తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కేఆర్ఎంబీ తెలంగాణను కోరింది. ఆ అంశాలపై కూడా భేటీలో చర్చించనున్నారు. చిన్ననీటి వనరులకు కేటాయించిన నీటి కంటే ఎక్కువ మొత్తాన్ని తెలంగాణ వినియోగించుకుంటోందని ఆంధ్రప్రదేశ్ గతంలో బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. 

ఇదీ చదవండి

అక్టోబర్​లో తీవ్రస్థాయికి కరోనా 3.0- బడులు​ తెరిచేదెలా?

Last Updated : Aug 23, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.