Somireddy on Minister Kakani: సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భూ అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందని మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో మండిపడ్డారు. వెంకటాచలం మండలంలో 300 ఎకరాల దేవుని పొలాలను ఆక్రమించిన మంత్రి కాకాని.. తన అనుచరులకు పంచిపెట్టారని ఆరోపించారు. ఈ భూమి నేషనల్ హైవేకి పక్కనే ఉండటంతో.. 600 కోట్ల రూపాయల పలుకుతుందని అన్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను బినామీ పేర్లు పెట్టి.. కాకాని సొంతం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నా.. ఆక్రమిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అసలు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు తెలుగుదేశం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందన్నారు.
ఇవీ చదవండి: