వైకాపా ప్రభుత్వం దళితులను వేధింపులకు గురి చేస్తోందని తెదేపా నేత జన్ని రమణయ్య విమర్శించారు. దళిత డాక్టర్ సుధాకర్‌కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ కులాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. దళితుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని జన్ని రమణయ్య ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, దాడులు చేయించటం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. సౌకర్యాలు లేవని అడిగిన డాక్టర్ సుధాకర్‌ను మతిస్థిమితం లేనివాడిగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు.
ఇదీ చూడండి