నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తెదేపా నేతలు ఆందోళన చేశారు. గత ఏడాది చేసిన ఉపాధి పథకం పనులకు సంబంధించి బిల్లులను వెంటనే చెల్లించాలంటూ ర్యాలీ చేశారు. అధికారులు స్పందించకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.
ఇదీ చూడండి