ETV Bharat / state

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా జోరు - తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పనబాక లక్ష్మి

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా జోరు పెంచింది. ఎండను కూడా లెక్కచేయకుండా కార్యకర్తలతో కలిసి అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓ దుకాణం వద్ద టీ కలుపుతూ.. ఓట్లను అభ్యర్థించారు.

tdp leaders campaign at manabolu
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో తెదేపా జోరు
author img

By

Published : Apr 3, 2021, 3:15 PM IST

ఎండలో తెదేపా కార్యకర్తలతో పనబాక లక్ష్మి,మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రచారం
మండుటెండలో కూడా లెక్క చేయకుండా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మనుబోలు మండలం పిడురూ గ్రామంలో ఉదయం నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. దుకాణాల వద్దకు వెళ్లి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

వైకాపా అధికారంలో వచ్చినప్పటి నుంచి నిత్యావసర ధరలు విపరీతంగా పెంచారని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ఆరోపించారు. పెరిగిన ధరలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో పనబాక లక్ష్మిని గెలిపించాలని సోమిరెడ్డి ప్రజలను కోరారు.

ఇదీ చూడండి.
తెలంగాణ ఫలితాన్నే తిరుపతిలో రిపీట్ చేస్తాం: ఎమ్మెల్యే రఘునందన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.