జగన్ పిటిషన్ కొట్టివేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పుపై తెదేపా నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఆర్థిక నేరాలు, పెద్ద కేసుల్లోని ముద్దాయిలు.. ఎంత పెద్దవాళ్లైనా చట్టం ముందు సమానమేనని కోర్టు సందేశాన్ని ఇచ్చిందన్నారు. ప్రజలు కోరుకున్న తీర్పునే న్యాయస్థానం ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్... రాజీనామా చేస్తారా లేదా అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి : జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ కొట్టివేత