నెల్లూరు జిల్లా కావలి పట్టణ ముఖద్వారమైన ముసునూరు వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ముఠా పట్టపగలు ఎన్టీఆర్ విగ్రహం తొలగించడం దుర్మార్గం అంటూ... మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎవరికీ ఇబ్బంది లేకుండా రోడ్డుకు దూరంగా ఉన్న విగ్రహాన్ని తొలగించడం వైకాపా నేతల దౌర్జన్యాలు, విధ్వంసాలకు పరాకాష్ట అని విమర్శించారు. బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని తెదేపా జిలా అధ్యక్షుడు బీదా రవిచంద్ర డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: