ETV Bharat / state

విచారణలో తేలిన నిజాలు.. తహసీల్దార్ సస్పెండ్

author img

By

Published : Jan 6, 2023, 2:03 PM IST

TAHSILDAR SUSPENDED : రెవెన్యూ శాఖ వైపు చూడలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఆ శాఖతో ఏ చిన్న పనిపడిన అటేండర్​ దగ్గరి నుంచి పై స్థాయి అధికారుల వరకు నగదు డిమాండ్​ చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారి భయాలు నిజమానిపించేటట్లు.. నెల్లూరు జిల్లాలోని తహసీల్దార్​.. ఓ రైతు నుంచి నగదు డిమాండ్​ చేసి సస్పెండ్​కు గురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

TAHSILDAR SUSPENDED
బుచ్చిరెడ్డి మండలం తహసీల్దార్​ సస్పెండ్

TAHSILDAR SUSPENDED : నెల్లూరు జిల్లాలో రైతు వద్ద నగదు డిమాండ్​ చేసిన ప్రమీల అనే తహసీల్దార్​పై సస్పెండ్​ వేటు పడింది. సుబ్బారెడ్డి అనే రైతు వద్ద నుంచి తహసీల్దార్​ నగదు డిమాండ్​ చేసిందనే ఆభియోగాలపై అధికారులు విచారణ చేపట్టారు. నిజమని తేలటంతో సస్పెండ్​ చేశారు. బుచ్చిరెడ్డి మండలం మినగల్లు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డికి 11ఎకరాల భూమి ఆన్​లైన్​లో నమోదు చేయటానికి.. బుచ్చిరెడ్డి తహసీల్దార్​ ప్రమీల నగదు డిమాండ్​ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో రైతు వద్ద నుంచి తహసీల్దార్​ నగదు డిమాండ్​ చేసిన విషయం నిజమని తేలిందని అధికారులు తెలిపారు. దీంతో ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్​ చేశారు. ఈమె గతంలో విధులు నిర్వహంచిన దగదర్తి మండలంలోనూ ఆరోపణలున్నాయని ఆ మండల ప్రజలు అంటన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.