వైకాపా ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సానుభూతితో ఓట్లు పొందిన సీఎం జగన్... క్షమించండంటూ మళ్లీ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భాజపా కార్యకర్తలపై వైకాపా నాయకులు దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు.
ప్రజా ప్రతినిధులు భూకబ్జాలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయలక్ష్మీ, జిల్లా జనరల్ సెక్రటరీ రాజేష్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'అర్హులమే.. అయినా ఇంటి పట్టా రాలేదు'