ETV Bharat / state

గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య చర్యలు అధ్వాన్నం.

ఏకధాటిగా కురుస్తున్న వర్షలకు కాలువల్లోని మురుగు నీరు రోడ్ల మీద ప్రవహిస్తోంది. దీంతో గుంతల్లో నీరు నిలిచి.. దోమలకు నిలయంగా మారాయి. మరో వైపు ఇంటింటా చెత్త సేకరణ పనులు సరిగా జరగక పోవటంతో దోమల బెడద ఎక్కువైంది. ఫలితంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

viral fevers in nellore
నెల్లూరు గ్రామీణ, పట్టణాల్లో పారిశుద్ధ్య చర్యలు
author img

By

Published : Oct 12, 2020, 12:24 PM IST

రోజూ అడపాదడపా వర్షం కురుస్తోంది. వారం నుంచి ముసురు వాతావరణం నెలకొంది. కాలువల్లో మురుగు పారక, గుంతల్లో నీరు నిలిచి.. దోమల ఆవాస ప్రాంతాలుగా మారాయి. పగలూ రాత్రి తేడా లేదు.. ఇంటా బయటా లేదు.. అంతటా దోమల రొదే.. వాటి కారణంగా నమోదవుతున్న జ్వరాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. జిల్లాలోని 75 పీహెచ్‌సీల్లో రోజుకు 225 కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుత ముసురుతో ఇవి మరింత పెరిగే అవకాశముంది. నగర, పురపాలక సంఘాలు, పంచాయతీల్లో వీటి నివారణకు అధికారులు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

జిల్లాలో పారిశుద్ధ్యం లోపించింది. పట్టణాలు, గ్రామాల్లో మురుగు కాలువల్లో నీటి పారుదల ఉండటం లేదు. ఇవి దెబ్బతిని పూడికతో పేరుకుపోయాయి. ఇంటింటా చెత్త సేకరణ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం, ప్రజలు కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయడం.. తదితర కారణాలతో దోమలు పెరిగిపోతున్నాయి. నివాసం, మెట్ట, తీర ప్రాంతం అనే తేడా లేకుండా విజృంభిస్తున్నాయి. ఫిర్యాదులు ఎన్ని అందుతున్నా అధికారులు పారిశుద్ధ్య చర్యలను పటిష్ఠంగా చేపట్టడం లేదు. ఫలితంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. వైద్యశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందే సరికి ఏమవుతుందోనని భయపడి ‘ప్రైవేటు ’కు పరుగులు తీస్తున్నారు.

రోజుకు 225 కేసులు

దోమలు ప్రాణాంతక జ్వరాలను వేగంగా వ్యాప్తి చేయడంలో ముందుంటాయి. జిల్లాలో సాధారణ పరిస్థితుల్లోనే దోమలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి. జిల్లాలోని 75 పీహెచ్‌సీల్లో రోజుకు 225 జ్వరాల కేసుల నమోదవుతున్నాయి. అధికారులు సకాలంలో చర్యలు చేపట్టకపోతే జ్వరపీడితుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఆధునిక యంత్రాలున్నా..

జిల్లాలో నగరపాలక సంస్థతో పాటు కావలి, ఆత్మకూరు, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, నాయుడుపేట పురపాలక సంఘాలు, 940 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాకు ఏటా దాదాపు రూ.50 కోట్లు పారిశుద్ధ్యానికి వెచ్చిస్తున్నారు. ప్రభుత్వం ఆధునిక యంత్రాలు అందిస్తున్నా అధికారులు వాటిని వినియోగించడంలో విఫలమవుతున్నారు. నగరంలో ఒక్కో దోమల నియంత్రణ పరికరాన్ని రూ. 8.5 లక్షలతో కొనుగోలు చేశారు. ఇలాంటివి నగరంలో మూడు ఉన్నాయి. వీటిని ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉంచారు. 54 డివిజన్లలో పంపింగ్‌ యంత్రాలు అందించినా వాటిని వినియోగించడం లేదు. దీంతో పాటు ప్రతి గ్రామ పంచాయతీకి అందించిన పరికరాలు అటకెక్కాయి. నగరంలో పారిశుద్ధ్య కార్మికులు 1,477 మంది ఉన్నారు. వీరిలో ఔట్‌సోర్సింగ్‌ 877, పర్మినెంట్‌ 350, ప్రైవేటుగా 250 మంది ఉన్నారు. సిబ్బంది కొరత లేకున్నా ఎక్కడికక్కడే చెత్త నగరంలో కనిపిస్తోంది. మురుగు కాలువల్లో నీటి పారుదల సెకనుకు 20 సెంటీమీటర్ల వేగంతో ఉంటే దోమల పెరుగుదల ఉండదు. ఈ దిశగా చర్యలు లేకపోవడంతో దోమలు పెరుగుతున్నాయి.
దోమల నివారణకు చర్యలు
- డాక్టర్‌ వెంకటరమణ, ఆరోగ్యాధికారి

నగరపాలక సంస్థలో దోమల నివారణకు రసాయనాలు వెదజల్లడం, మురుగు నీరు నిల్వ లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ఎక్కడా చెత్త నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించాలి.
ఏం చేయాలంటే..

కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి మురుగునీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలి. మెలాథియన్‌ ఆయిల్‌ బాల్స్, వాడేసిన ఇంజిన్‌ ఆయిల్‌ కాలువలు, గుంతల్లో వేస్తే లార్వా నాశనమవుతుంది. మరుగుదొడ్ల ట్యాంకుల గొట్టాలకు వలలు కట్టాలి. ఫాగింగ్‌ చేపట్టాలి. నీరు నిల్వ ఉండే చోట లార్వాలను తినే గంబూషియా చేపలను విడిచిపెట్టాలి. ఇలాంటి పనులు చేపట్టాల్సిన పురపాలక సంఘాలు, పంచాయతీలు మొక్కుబడి పనులతో సరి పెడుతున్నాయి.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది దోమల నివారణకు ఉపయోగించే ఫాగింగ్‌ యంత్రాలు. ఒక్కొక్కటి రూ.8.50 లక్షలు విలువైన యంత్రాన్ని నగరపాలక సంస్థ కొనుగోలు చేసింది. దాంతో పాటు దాతలు రెండు యంత్రాలను అందించారు. అధికారులు, పాలకులు మాత్రం దాతల ఆశయాన్ని నీరుగార్చారు. ఆరంభ శూరత్వంగా 10 రోజులు వినియోగించి వాటిని వాహనాల షెడ్డులోని చెట్ల కిందకు చేర్చేశారు.

ఇదీ చదవండీ..బ్రిటన్‌ హై కమిషనర్​గా దిల్లీ అమ్మాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.