ETV Bharat / state

స్కీమ్ పేరుతో స్కామ్... తెలివిగా మోసం

చట్టబద్దమైన అనుమతులు లేకుండా వెల్ పే ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న కొందరిని నెల్లూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. 12,600మందిని ఆ కంపెనీ మోసం చేసినట్లు దర్యాప్తులో తేలిందని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు.

sp-bhaskar-bhushan-press-meet-on-well-pay-trading-fraud-case-at-nellore
సర్కిలేషన్ స్కీమ్ పేరుతో మోసం... పట్టుబడ్డ నిందితలు
author img

By

Published : Oct 7, 2020, 5:21 PM IST

సర్క్యులేషన్ స్కీమ్ పేరుతో మోసాలకు పాల్పడిన ముఠాను నెల్లూరు పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ముఠాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వివరించారు. నెల్లూరు నగరం వేదాయిపాలెంలో మైఖేల్ సుమన్, రవి, శ్రీను కలసి ఫిబ్రవరిలో రిత్విక్ ఎన్​క్లైవ్ వెల్ పే ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. సాఫ్ట్​వేర్​ను ఐత్రీ సోల్యూషన్స్ వద్ద నుంచి కొనుగోలు చేసి ఆన్ లైన్ ట్రేడింగ్ చేస్తున్నామని చెప్పి వినియోగదారుల నుంచి డిపాజిట్ సేకరించారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ ద్వారా ఆన్​లైన్​లో 12,600 మంది వద్ద ఏడు నెలల్లో రూ. 85 కోట్లు వసూలు చేశారు.

రెట్టింపు పేరుతో వల..

వెల్ పే కంపెనీకి పదివేల రూపాయలు డిపాడిట్ చేస్తే మరుసటి రోజు నుంచి ప్రతి రోజు రూ. 200 కస్టమర్ అకౌంట్​లో జమ చేస్తారు. వంద రోజుల్లో కస్టమర్​కి రెట్టింపు జమ అవుతుంది. ఇటువంటి అనేక స్కీమ్​లను ఆశ చూపించారు. కొందరు.. ఆశతో రెండు కంటే ఎక్కువ ఐడీలు తీసుకుని రొటేషన్ పద్దతిలో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.

అనుమతులు లేవు...

ప్రత్యేక దర్యాప్తులో ఈ కంపెనీకి ఎటువంటి అనుమతులు లేవని తేలింది. ఈ కేసులో నిందితులు మైఖేల్ సుమన్, రవి, శ్రీను అదుపులోకి తీసుకోగా.. వారి వద్ద రూ. 1,29 కోట్లు నగదు పట్టుబడింది. ఐదు ల్యాప్ ట్యాపులు. ప్రెస్ స్టిక్కర్​తో ఉన్న కారు, ఐదు మోబైల్ ఫోన్​లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

మోసపోవద్దు..

పెట్టుబడులకు అతి తక్కువ కాలంలో రెట్టింపు లాభాల వస్తాయని ఆశగా ఎదురు చూడవద్దని నెల్లూరు పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెబీ, ఆర్బీఐ నుంచి చట్టబద్దమైన అనుమతులు లేని కంపెనీల్లోకి పెట్టుబడు కోసం వెళ్లొవద్దని ఎస్పీ సూచించారు.

ఇదీ చూడండి:

బంతి.. బంతికీ బెట్టింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.