ETV Bharat / state

Jagananna Housing Colonies: సరిపడని ఆర్థిక సాయం.. ఆగిన ఇళ్ల నిర్మాణం!

author img

By

Published : Sep 12, 2021, 9:01 PM IST

నెల్లూరు జిల్లాలోని జగనన్న ఇళ్ల నిర్మాణాల పనులు నత్తనకడకన సాగుతున్నాయి. ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరు, కావలి ప్రాంతాల్లో కొందరు ఇళ్ల నిర్మాణాలను అసలు ప్రారంభించలేదు. మరికొందరైతే పునాదులు తీయించి మధ్యలోనే విరమించుకున్నారు. చాలా మందికి లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారు.

slow-housing-construction-in-nellore-district

నత్తనడకగా సాగుతున్న ఇళ్ల నిర్మాణాలు

ఇన్ని రోజులూ సొంత గూడు కోసం ఎదురుచూశారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలతో సొంతింటి కళ నెరువేరుతుందని సంబరపడ్డారు. మొదట్లో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పడంతో లబ్ధిదారులు ముందుకు వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం సరిపడకపోవడంతో.. ఆసక్తి సన్నగిల్లి నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. కొందరైతే అసలు ప్రారంభించనే లేదు. నెల్లూరు జిల్లా అధికారులు లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నా.. ఇళ్ల నిర్మాణాలు మాత్రం నెమ్మదిగానే సాగుతున్నాయి.

నెల్లూరు జిల్లాలోని ఇళ్ల నిర్మాణాల పథకం జోరుగా సాగడం లేదు. ఆత్మకూరు, నాయుడుపేట, గూడూరు, కావలి ప్రాంతాల్లో కొందరు ఇళ్ల నిర్మాణాలను అసలు ప్రారంభించలేదు. మరి కొందరైతే పునాదులు తీయించి మధ్యలోనే విరమించుకున్నారు. చాలా మందికి లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించారు. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణ సామగ్రి పూర్తిస్థాయిలో అందుబాటులో లేని పరిస్థితి. దీంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడం లేదు.

ఇసుక సమస్యతో పాటు రవాణా ఖర్చులు లబ్ధిదారులను భయపెడుతున్నాయి. ఆత్మకూరులో నీటి సమస్య తలెత్తుతోంది. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా సరిపోని పరిస్థితి. ఇంకొన్ని చోట్ల లేఅవుట్ లో మైయిన్ లైన్ విద్యుత్ లైన్‌లు లేకపోవడంతో నిర్మాణాలు నిలిపివేశారు. కూలీల ఖర్చులు పెరిగినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్షా 80వేల రూపాయలు పునాదులకే సరిపోతాయని మిగతా పనులను ఎలా పూర్తి చేయాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.

గూడూరు, కావలిలో రోడ్లు, విద్యుత్, కాలువలు పనులు మొక్కుబడిగా సాగుతున్నాయి. చేసిన పనులకు బిల్లులు రావడంలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అప్పు చేసి నిర్మాణాలు చేయడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాష్ట్రంలో ఐదో స్ధానంలో ఉంది. సెప్టెంబర్ 30లోపు ఇళ్ల నిర్మాణాం.. పునాదులు స్థాయి దాటాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ముందుకు నడవని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: గ్రామ యోజన అవార్డుకు ఎంపికైన నెల్లూరు, తూ.గో. జిల్లాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.