మాయమాటలు చెప్పి ఓ ఎస్ఐ తనను లోబరుచుకున్నాడని నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక ఆరోపించింది. బిట్రగుంట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భరత్ కుమార్ తనను మోసగించాడంటూ సదరు బాలిక ఆరోపించింది.
ఆమె మాట్లాడుతూ.. పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో ఆ ఎస్ఐ తనకు మాయమాటలు చెప్పేవాడని తెలిపింది. ఆ విధంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరచుకున్నాడని ఆరోపించింది. ఆ తర్వాత పెళ్లి విషయం ఎత్తితే తనకు సంబంధం లేదనటంతో.. 3 నెలల క్రితం దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు చెప్పింది. ఉన్నతాధికారులు ఎస్సైని సస్పెండ్ చేశారే తప్ప తమకు ఎలాంటి న్యాయం చేయలేదని బాలిక పేర్కొంది. ఇప్పుడు ఆ ఎస్సై తమను బెదిరిస్తున్నాడని.. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. బాలికకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలిపింది. ఆమెకు న్యాయం జరగకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరాజు చెప్పారు.
నేను పాఠశాలకు వెళ్లి వచ్చే సమయంలో ఎస్సై మాయమాటలు చెప్పి నన్ను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోమంటే మొహం చాటేశాడు. అప్పటినుంచి నన్ను వేధించడం మొదలుపెట్టాడు. అవి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాను. దీనిపై దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ నాకు న్యాయం జరగలేదు. ఆ ఎస్సైను అరెస్ట్ చేయలేదు. నాకు న్యాయం కావాలి -- బాలిక
ఇవీ చదవండి..