నెల్లూరులో వ్యభిచారగృహాల గుట్టురట్టైంది. లఘుచిత్రాల్లో అవకాశం ఇస్తానంటూ మహిళలను మోసం చేసి వ్యభిచారగృహాలు నిర్వహిస్తోన్న నిందితుడు షేక్ జాకీర్ హుస్సేన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవూరుకు చెందిన ఓ బాలిక ఫిర్యాదుతో వ్యభిచారగృహాల వ్యవహారం బయటపడింది. జాకీర్ నిర్వహిస్తున్న 7 వ్యభిచారగృహాలపై పోలీసులు దాడులు చేసి... 8 మంది నిర్వాహకులు, ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బాధిత మహిళలను పునరావాస కేంద్రానికి తరలించారు.
ఇదీ చదవండి :