'సంక్షేమ పథకాల అమలుకు సీఎం కృషి చేస్తున్నారు' - latest news of amaravathi issue
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలుకు ముఖ్యమంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి వైకాపా ప్రణాళికతో ముందుకు సాగుతోందని, అడుగడుగునా చంద్రబాబు అడ్డుపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.