ETV Bharat / state

సంక్రాంతి ప్రయాణికుల కోసం.. నెల్లూరు నుంచి ప్రత్యేక బస్సులు సిద్ధం

author img

By

Published : Jan 10, 2021, 11:04 AM IST

సంక్రాంతికి అందరూ ఇళ్లకు వెళుతున్నారు. వారి సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. నెల్లూరు నుంచి విశాఖ, విజయవాడ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు వెళ్లడానికి బస్సుల సంఖ్యను పెంచింది. ఈరోజు నుంచి 20వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఆర్ఎం శేషయ్య తెలిపారు.

sankranthi special buses at nellore
సంక్రాంతి పండగకు నెల్లూరు నుంచి ప్రత్యేక సర్వీసులు సిద్ధం

నెల్లూరు జిల్లాలో 10 ఆర్టీసీ డిపోల పరిధిలో సంక్రాంతికి 10వేల మంది గ్రామాలకు వెళ్తారని అంచనా వేశారు అధికారులు. దూరప్రాంత ప్రయాణికుల అవసరాల కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. నెల్లూరు నుంచి విశాఖ, విజయవాడ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ప్రాంతాలకు 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 191 ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. ప్రతి రోజు ఐదు అదనపు సర్వీసులు నడుపుతున్నారు.

  • నెల్లూరు -విశాఖపట్నంకి 25 ప్రత్యేక బస్సులు కాగా... ప్రతి రోజు సాధారణంగా 3 సర్వీసులు ఉంటాయి.
  • నెల్లూరు నుంచి హైదరాబాద్​కు వెళ్లే రెగ్యులర్ సర్వీసులు 6 ఉండగా... ప్రత్యేక సర్వీసులు 9వ తేదీ నుంచి మూడు, 10వ తేదీన ఆరు, 11వ తేదీన పది, 12వ తేదీన 15, 13వ తేదీన రెండు బస్సులు ఏర్పాటు చేశారు.
  • చెన్నైకి రెగ్యులర్ సర్వీసులు 29 నడుస్తుండగా.. ప్రత్యేకంగా రోజుకు 6సర్వీసులు పెంచారు. ఐదు రోజులకు 30 సర్వీసులు నడుస్తాయి.
  • విజయవాడకు రెగ్యులర్ సర్వీసులు 26. ప్రత్యేక సర్వీసులు ప్రతి రోజు 14 నడుపుతున్నారు. ఐదు రోజులకు 70సర్వీసులు ఏర్పాటు చేశారు.
  • బెంగళూరుకు రెగ్యూలర్ సర్వీసులు ఇప్పటికే 16 ఉండగా... ప్రత్యేక సర్వీసులు ప్రతి రోజు 6 బస్సులు నడపనున్నారు. 13వ తేది వరకు 30 సర్వీసులు ఏర్పాటు చేశారు.

ఈ ప్రత్యేక బస్సులకు రవాణా ఛార్జీలు పెంచలేదని ఆర్టీసీ ఆర్ఎం శేషయ్య తెలిపారు. 14,15, 16 తేదీల్లో పెద్దగా ప్రయాణాలు ఎక్కువగా ఉండవని.. 17వ తేది నుంచి మరలా పై విధంగానే ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు. రెండు రోజులు ముందుగా రిజర్వేషన్లు చేసుకోవచ్చునని చెప్పారు.

ఇదీ చూడండి:

ముఖ్యమంత్రి జగన్... మాట నిలబెట్టుకోండి: పవన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.