ఇళ్లలో చోరీలకు పాల్పడే దొంగలు.. ఇప్పడు ఏకంగా జాతీయ రహదారులపైనే దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనే నెల్లూరు జిల్లా కోవూరు మండలం రామన్నపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ నుంచి కూలర్లును దోచుకెళ్లారు. వీటి విలువ రూ.3 లక్షలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి..