నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మినీలారీ, ట్రావెల్స్ బస్సు ఢీ కొన్న ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులోని 25 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీచదవండి