నెల్లూరు జిల్లా నాయుడుపేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట వాహనాల డ్రైవర్లు ధర్నా చేశారు. ప్రజలకు ఇంటింటికీ రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే సిబ్బంది అయిన తాము.. కరోనా వ్యాప్తి విజృంభణతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అదనపు సిబ్బంది విధులకు రావట్లేదని.. తద్వారా భారమంతా తమపైనే పడుతుందన్నారు. ఈ మేరకు తమకు భద్రత కల్పించి జీతం పెంచాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: