ETV Bharat / state

వేగంగా సాగుతున్న రీసర్వే ప్రక్రియ - Nellore District News

నెల్లూరు జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియ వేగంగా సాగుతోంది. కరోనా ఉద్ధృతి, ఎన్నికల కారణంగా జాప్యం జరిగినప్పటికీ....రీసర్వే నిర్వహణలో నెల్లూరు జిల్లా మూడో స్థానంలో ఉంది. తొలిదశలో 400 గ్రామాల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకోగా.........31 వేల ఎకరాల్లో ప్రక్రియ పూర్తయింది.

వేగంగా సాగుతున్న రీసర్వే ప్రక్రియ
వేగంగా సాగుతున్న రీసర్వే ప్రక్రియ
author img

By

Published : Mar 14, 2021, 4:12 AM IST

వేగంగా సాగుతున్న రీసర్వే ప్రక్రియ

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియ....,నెల్లూరు జిల్లాలో వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో రీసర్వే నిర్వహించి.....సుమారు వందేళ్లు కావస్తోంది. 30 ఏళ్లకు ఒకసారి సర్వే చేయాల్సి ఉన్నా.......అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే వందేళ్ల వరకూ శాశ్వత భూహక్కు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో....ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రక్రియ మొదలైంది. కరోనా సహా ఎన్నికల కారణంగా కాస్త ఆలస్యమైనా మళ్లీ మొదలైంది.

నెల్లూరు జిల్లాలో 12 వందల గ్రామాల్లోని 4 లక్షల 56 వేల సర్వే నెంబర్లలో...13 లక్షల 16 వేల 144 హెక్టార్లలో సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం....,నెల్లూరు జిల్లాకు 90కోట్ల రూపాయలు కేటాయించారు. 4 దశల్లో పూర్తి చేయాలని భావిస్తుండగా.....ప్రతి మండలంలో ఐదు గ్రామాల్లో డ్రోన్‌ల సాయంతో సర్వే చేస్తున్నారు. ఒక్కో డ్రోన్..రోజుకు 60 ఎకరాల్లో సర్వే చేస్తుంది.

80 రోజుల్లో 31 వేల ఎకరాల్లో పూర్తి చేశారు. కొన్ని గ్రామాల డ్రోన్ డేటాను సర్వే ఆఫ్ ఇండియాకు పంపించారు. ఈ ప్రక్రియలో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే మూడో స్థానంలో ఉంది.

జిల్లాలో ప్రత్యేక శిక్షణ పొందిన 483 మంది సిబ్బంది....రీసర్వే విధుల్లో ఉన్నారు. రోజుకు కనీసం 2 గ్రామాల్లో ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ హనుమాన్ ప్రసాద్. నూతన సాంకేతికత వల్ల......సర్వే లెక్కల్లో కచ్చితత్వం ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి

వైకాపా అభ్యర్థులతో ఎమ్మెల్యే ఆనం సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.