దివంగత మాజీ ప్రధాని పీవీ. నరసింహారావు 16వ వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరులో ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కార్పొరేషన్ సిబ్బంది పీవీ నరసింహారావు ఫ్లెక్సీలను తొలగించారంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆధ్యాత్మిక వేత్త బుర్రా భాస్కర శర్మ, బ్రాహ్మణ సంఘం నేత భువనేశ్వరి ప్రసాద్ లు పాల్గొన్నారు. ప్రధానిగా పీవీ దేశానికి అందించిన సేవలను వారు కొనియాడారు. తెలుగుజాతి ప్రతిష్టను ఇనుమడింపజేశారని ప్రశంసించారు. నెల్లూరులో పీవీ గౌరవార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మాటిచ్చారు.
ఇదీ చదవండి: పోలవరంలో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభం