Pushpayagam: నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అమ్మవారి ప్రతిష్టాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని.. అర్చకులు పుష్పయాగం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, విశేష పూజల నడుమ.. అమ్మవారికి 14 రకాల పూలతో పుష్పాభిషేకం చేశారు.
రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి ఆధ్వర్యంలో.. 14 ఏళ్లుగా ఈ పుష్పయాగం జరుగుతోంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుష్పాభిషేకాన్ని తిలకించి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు.
ఇదీ చదవండి: