ETV Bharat / state

10 ఉపగ్రహాలతో నేడు నింగిలోకి పీఎస్ఎల్వీసీ 49

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలోని షార్ నుంచి పీఎస్ఎల్వీసీ 49ను నింగిలోకి పంపనుంది. మనదేశంతోపాటు ఇతరదేశాలకు చెందిన 10ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.

PSLVC49  going to launch today
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీసీ 49
author img

By

Published : Nov 7, 2020, 8:18 AM IST

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగానికి సిద్ధమైంది. నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి మధ్యాహ్నం 3.02 గంటలకు పీఎస్ఎల్వీసీ49ను నింగిలోకి పంపనుంది. 2020సంవత్సరంలో చేపట్టిన ఈ ప్రయోగం షార్​లో మొదటిది. ఇది విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఇస్రో ఛైర్మన్ శివన్ శ్రీహరికోటకు చేరుకుని ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

ఎంసీసీ, ఎల్సీసీల నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియను శాస్త్రవేత్తలు ప్రారంభించారు. 26గంటలుగా ఈ ప్రక్రయ నిర్విరామంగా కొనసాగుతోంది. మన దేశానికి చెందిన ఈవోఎస్ -01శాటిలైట్​తోపాటు విదేశాలకు చెందిన మరో 9 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఇస్రో నుంచి 51వ ప్రయోగం కాగా.. షార్ నుంచి చేస్తున్న 76వ ప్రయోగంగా ఇది నిలవనుంది. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలపై అధ్యయనం జరిపే ఎర్త్ అబ్జర్వరేషన్ స్వదేశీ శాటిలైట్​ను ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చూడండి. 'విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.