భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ - సీ50 ప్రయోగం జరిపేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మంగళవారం షార్‌లోని భాస్కర అతిథి భవనంలో రాకెట్ సన్నద్ధత సమావేశం జరిగింది. ఇందులో శాస్త్రవేత్తలు వివిధ అంశాలపై చర్చించారు. సాయంత్రం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్) సమావేశం జరిగింది. ప్రయోగానికి ముందుగా 25 గంటలపాటు కౌంట్‌డౌన్ నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించేలా శాస్త్రవేత్తలు షెడ్యూల్ రూపొందించుకున్నారు. కౌంట్‌డౌన్ ముగిసిన తదుపరి గురువారం సాయంత్రం 3.41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది 1,410 కిలోల బరువు గల కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01ను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.
ఇదీ చదవండి: అమరావతి: రేపు 'జనరణభేరి' భారీ బహిరంగ సభ