Problems at Tidco Housing Complex : టిడ్కో ఇళ్ల సముదాయంలో బాధితుల కష్టాలు ఇంకా తీరలేదు. ఐదేళ్ల కిందట టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లకు నాలుగేళ్ల తరువాత తాళాలు ఇచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేశ్.. ఇళ్ల ప్రారంభ వేడుకను ఘనంగా నిర్వహించారు. కానీ, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంలో నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యాన ఐదు నెలలుగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు గృహసముదాయంలో టిడ్కో లబ్ధిదారులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. మంత్రి ప్రారంభించిన తరువాత జిల్లా అధికారులు, ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వెళ్లకపోవడంతో సమస్యలు వినేవారు లేరని బాధితులు వాపోతున్నారు.
Tidco Houses Lacked Security: టిడ్కో ఇళ్లలో భద్రత కరవు.. మూడేళ్ల చిన్నారిని చిదిమేసిన విద్యుత్ తీగలు
Tidco Housing Complex: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక సంఘం పరిధిలో టీడీపీ ప్రభుత్వం అప్పట్లో 300మందికి టిడ్కో ఇళ్ల సముదాయాన్ని నిర్మించింది. చక్కటి స్థలంలో.. ఆహ్లాదకరమైన వాతావరణంలో పేదలకు ఇళ్లు నిర్మించారు. ఎన్నికలు రావడంతో గృహప్రవేశాల కార్యక్రమం వాయిదా పండిది. కాగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం (YCP Govt) లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు ఇవ్వకుండా నాలుగేళ్లు కాలం గడిపింది. నాలుగు నెలల కిందట మంత్రి ఆదిమూలపు సురేశ్.. ఆర్బాటంగా 300మందికి తాళాలను అందజేసి గృహప్రవేశాలు చేయించారు. స్వయంగా మంత్రి పాల్గొనడం, మిగిలిన సమస్యలను పరిష్కరిస్తారని చెప్పడంతో ఆశపడ్డారు. ఇప్పటికి నాలుగు నెలలు కావస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పెన్నా నది నుంచి నీటి వసతి కల్పిస్తామన్న హామీ నెరవేరలేదు. బోర్ల నుంచి ఇస్తున్న నీటిలో మట్టి, బంక ఉండటంతో చర్మవ్యాధులు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు. దూరప్రాంతంలో ఉన్నందున మినరల్ క్యాన్లను కొనడం ఆర్థికంగా భారంగా మారిందని వాపోతున్నారు. టిడ్కో ఇళ్ల సముదాయంలో పాలకులకు రంగులు వేయటం మీద కలిగిన శ్రద్ధ మౌలిక సదుపాయాలు (Infrastructure) కల్పించటంలో కొరవడిందని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు, డ్రైనేజీ, వీధి లైట్లు, పైప్‌లైన్ లీకేజీ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు.
Prathidwani: జగన్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలేంటి? కట్టిన ఇళ్లు ఎన్ని?
Tidco Housing Complex: అధికారులు రాకపోవడం, ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడంతో నిర్వహణ సమస్యలు తలెత్తాయి. పైప్ లైన్లు లీక్ అవుతున్నాయి. మురుగుకాల్వలు లేక నీరు బయట నిలబడిపోతోంది. దుర్గంధం వ్యాపించి దోమలు విజృంభిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో జనం బాధపడుతున్నారు. అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, సర్వేపల్లి, కందుకూరు పలు ప్రాంతాల్లో ఎంతో మంది టిడ్కో లబ్ధిదారులు (Tidco Beneficiaries) సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో ఉండలేక , బయట అద్దెలు చెల్లించలేక వత్తిడికి గురవుతున్నారు. టిడ్కో ఇళ్ల సముదాయంలో బాధితుల కష్టాలు ఇంకా తీరలేదు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంలో అధికారులు, పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
Tidco Housing Complex: టిడ్కో ఇళ్ల సముదాయంలో పెన్నా నది నుంచి నీటి వసతి కల్పిస్తామని హామీ నెరవేరలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. తాగునీటిని కొనుక్కొని తాగటం ఆర్థికంగా భారంగా మారిందని అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటంతో నిర్వాహణ సమస్యలు తలెత్తాయంటున్నారు. బయట ఇళ్లకు అద్దెలు చెల్లించలేక వసతులు లేనప్పటికీ టిడ్కో ఇళ్లలో ఉండాల్సి వస్తోందన్నారు. నివాసప్రాంతాల్లో పైపులైన్లు లీకేజీతో మురుగు చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి... టిడ్కో ఇళ్ల సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Gudivada TIDCO Houses: లబ్ధిదారులకు అందని తాళాలు.. మందుబాబులకు ఆవాసాలుగా టిడ్కో ఇళ్లు