నెల్లూరు డివిజన్లో నాలుగవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో వర్షం కురుస్తోంది. విడవలూరులో వానలోనే ఓటర్లు బారులు తీరారు. కోవూరులో వర్షం కారణంగా ఓటింగ్ మందకొడిగా జరుగుతోంది. వాన వల్ల బుచ్చిరెడ్డిపాలెంలో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని దామరమడుగు పోలింగ్ కేంద్రం వద్ద వీల్ఛైర్లు లేకపోవటంతో.. ఓటు వేసేందుకు వెళ్లిన వృద్ధులు అవస్థలు పడుతున్నారు. పలు కేంద్రాల్లో ఓటర్లు గొడుగులు పట్టుకుని లైన్లో వేచి ఉన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం