ETV Bharat / state

నెల్లూరులో కాజేశారు.. కాణిపాకంలో దొరికారు

ఏటీఎంలో నగదును డిపాజిట్ చేయడానికి వచ్చి.. వ్యానుతో సహా సొమ్మును అపహరించుపోయిన ఘటన నెల్లూరులో సంచలనం రేపింది. ఈ కేసును ఛాలెంజింగ్​గా తీసుకున్న పోలీసులు పక్క ప్రణాళికతో 24గంటల్లోనే నగదును, వ్యాన్​ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సాంకేతికతతో ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.

ATM cash
ఏటీఎం నగదు
author img

By

Published : Jul 30, 2021, 2:08 PM IST

ఎస్పీ విజయారావు

నెల్లూరులో రూ.50 లక్షల నగదు వ్యాన్‌తో పరారైన నలుగురు వ్యక్తులను.. 24 గంటలు గడవక ముందే పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 27వ తేదీన ATMలో నగదు నింపేందుకు ఏజీఎస్‌ సెక్యూర్‌ వ్యాల్యూ కంపెనీ వ్యాన్‌లో.. డ్రైవర్‌ పోలయ్య 50లక్షల రూపాయల నగదుతో బయల్దేరాడు. నెల్లూరు మద్రాస్‌ బస్టాండ్‌ వద్దకు రాగానే వ్యానులోని సిబ్బంది దిగిపోయారు. పథకం ప్రకారం వెంటనే వ్యాన్‌తో పోలయ్య ఉడాయించాడని.. ఈ చోరీలో పోలయ్య స్నేహితుడు సిద్దూ, అతని భార్య గౌరి, మరో మహిళ సోఫియా కూడా భాగస్వాములని ఎస్పీ విజయారావు తెలిపారు.

చోరీ తర్వాత వ్యాన్‌ సేఫ్‌ వాల్ట్‌ను పగలగొట్టి రూ.50లక్షలతో తిరుపతి చేరుకుని నగదును పంచుకున్నారన్న ఎస్పీ.. అక్కడి నుంచి కాణిపాకం వెళ్లారన్నారు. 28వ తేదీ సాయంత్రం గూడూరు రైల్వేస్టేషన్‌ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. ప్రత్యేక బృందాలతో నలుగురిని పట్టుకుని రూ.50లక్షల నగదు, వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండీ.. Night curfew: రాష్ట్రంలో ఆగస్టు 14 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.