ETV Bharat / state

మమ్మల్ని చంపేయండి: అధికారుల వద్ద ఓ రైతు తల్లి మొర - మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్

కేసులతో తన కుమారుడిని ఇబ్బందులు పెట్టవద్దని ఓ రైతు తల్లి రోదించింది. రోజూ వేధించే కంటే అధికారులే తమను చంపేయాలని కన్నీటితో వేడుకుంది. నిజాయితీగా ఉండటం కూడా తప్పేనా అని సూటిగా ప్రశ్నించింది. కన్నకొడుకుని చొక్కాపట్టుకుని పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టరే తమకు న్యాయం చేయాలని చేతులు జోడించి గోడు వెళ్లబోసుకుంది. ఆ తల్లి కన్నీటి వెనక ఉన్న కారణం ఏంటి? అసలు ఏం జరిగింది?

కేసులు పెట్టి వేధించడం కంటే మీరే చంపేయండి... రైతు తల్లి ఆవేదన

author img

By

Published : Nov 6, 2020, 5:52 PM IST

Updated : Nov 7, 2020, 12:31 PM IST

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రశ్నించిన దళిత రైతుపై అధికారులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన దళిత రైతు జైపాల్​ను ధాన్యం కొనుగోళ్లలో దళారులు మోసగించారు. విషయం అధికారులకు తెలియజేస్తే... తిరిగి ఆయనపైనే చీటింగ్ కేసు నమోదు చేశారు. దాంతో అతని తల్లి అచ్చమ్మ, తెదేపా నేతలతో కలిసి డీఆర్ఓ రమణకు వినతి పత్రం అందజేశారు. తన కుమారుడు నిజాయితీపరుడని, విషయం తెలుసుకోకుండా అతనిపై దొంగతనం ముద్ర వేయడమేమిటని ప్రశ్నించారు. కేసులతో వేధించే కంటే అధికారులే తమను చంపేయాలని కన్నీరుమున్నీరు అయ్యారు. చొక్క పట్టుకుని పోలీసు స్టేషన్​కు లాక్కెళ్లారని విలపించారు. తప్పు చేయకపోయినా దొంగతనం ముద్రపడిందని, జిల్లా పాలనాధికారి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

రైతు తల్లి ఆవేదన

కేసు నమోదు చేయడం అన్యాయం

రైతు జైపాల్​పై కేసుపెట్టి వేధించడం దారుణమని తెదేపా నేత అబ్దుల్ అజీజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ​కేసు ఉపసంహరించుకోవాలని డీఆర్ఓను కోరారు. పాలకులు మారుతుంటారని అధికారులు నిజాయితీగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. దళారీలు రైతుల పొట్టకొడుతున్నారని ప్రభుత్వం పట్టించుకోక పోగా వారిపైనే కేసులు వేయడం ఏమిటని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:
సంచార లైబ్రరీలో ఆసక్తికరమైన పుస్తకాలు..!

Last Updated : Nov 7, 2020, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.