నెల్లూరు జిల్లా చెజర్ల మండలం పుల్ల నీళ్లపల్లి గ్రామంలో పెన్నా పరివాహక ప్రాంతంలో 649 సర్వే నెంబర్‌లో ఉన్న 638 ఎకరాలు కబ్జా చేసి.. సాగు చేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కొందరు లంచాలు తీసుకుంటూ. బయట వ్యక్తులకు ఈ భూములు కట్టబెట్టారని వారు చెబుతున్నారు. ఆ పొలాలకు.. విద్యుత్ సదుపాయం కల్పించే క్రమంలో అక్కడికి వెళ్లిన గ్రామస్థులతో..భూమలు సాగు చేసుకుంటున్న వారు గొడవపడ్డారు. విషయం తెలుకొని ఘటనా స్థలానికి చేరుకొన్న అధికారులు ఇరువురితో మాట్లాడారు. ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: బొగ్గు లేక... ఆర్టీపీపీలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేత