నెల్లూరు జిల్లా పెన్నాడెల్టా ఆయకట్టు పరిధిలోని కాలువలు పూడికతో నిండిపోయాయి. పెన్నాడెల్టా ఆయకట్టు కింద సర్వేపల్లి కాలువ, జాఫర్ సాహెబ్ కాలువ, కృష్ణపట్నం కాలువలు ఉన్నాయి. ప్రధానంగా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి, పిడతా పోలూరు, మామిడిపల్లి, కాలువల్లో గుర్రపు డెక్కతో దర్శనమిస్తున్నాయి. కాలువల్లో పూడిక నిండుగా పెరిగిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి కాలువల్ని బాగు చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:
జొన్నవాడ క్షేత్రం చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు