ETV Bharat / state

'మంత్రులు చెప్పినట్లు... శాసనమండలి తలఊపదు'

అధికార పార్టీ నేతలకు కోపం వచ్చినంత మాత్రాన మండలి రద్దు సాధ్యంకాదని... పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రభుత్వం తెచ్చిన బిల్లులను మండలి సభ్యులు అంగీకరించలేదని... రద్దు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మండలి రద్దుకు ఓ ప్రక్రియ ఉందన్న బాలసుబ్రమణ్యం... దానికి నిర్ణీత సమయం పడుతుందన్నారు. రాత్రికిరాత్రే మండలి రద్దు చేయాలంటే.. అసాధ్యమని స్పష్టం చేశారు.

pdf mlc vittapu balasubrahmanyam
పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం
author img

By

Published : Jan 24, 2020, 7:15 PM IST

మంత్రుల తీరుపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యలు

శాసన మండలి రద్దు చేస్తామని వైకాపా ప్రభుత్వం అనడం చర్చనీయాంశంగా మారిందని... పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం అన్నారు. శాసనమండలి అవసరం లేదు... ఖర్చుతో కూడుకుందని ప్రభుత్వం చెప్పడంలో నిజం లేదన్నారు. ప్రభుత్వం తెచ్చిన బిల్లులను మండలి అంగీకరించలేదనే కోపంతో రద్దు చేస్తామని చెప్పడం మంచిదికాదని హితవు పలికారు.

శాసనమండలి పెద్దలసభన్న ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం... ప్రభుత్వం చెప్పినట్లే మండలి నడుచుకోవాలంటే సాధ్యపడదన్నారు. పెద్దలసభ మంత్రులు చెప్పినట్లు తల ఊపదని స్పష్టం చేశారు. మంత్రులకు కోపం వచ్చినంత మాత్రాన రద్దు సాధ్యం కాదన్నారు. రద్దుచేయాలంటే.. ఓ ప్రక్రియ ఉందని తెలిపారు. మండలి రద్దు చేసే ఆలోచనే ఉంటే... వైకాపా మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

మండలి రద్దుపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం వ్యాఖ్యలు

మంత్రులా.. మజిల్​మెన్​లా..?
పెద్దలసభలో జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలసభకు ఇచ్చే గౌరవం ఇదా అని ప్రశ్నించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు మండలిలో వ్యవహరించిన తీరు సరికాదన్నారు. మంత్రులు పోడియం వద్దకు వెళ్లడం బాధాకరమన్నారు. మండలిలో మంత్రులు మజిల్​మెన్​లా వ్యవహరించారని విమర్శించారు.

ఇదీ చదవండి : 'ఛైర్మన్ పోడియాన్ని ముట్టడించడం అనాగరికం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.