కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని.. మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని.. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ.1.20 కోట్ల వ్యయంతో 1000 ఎల్.పి.ఎం. సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్‌కు మంత్రులు శంకుస్థాపన చేశారు. జిల్లాలో 4 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని వారు అన్నారు.
ఇదీ చదవండి: