నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడలోని శ్రీ వెంగమాంబ ఆలయంలో గాజులపల్లి వెంకటేశ్వర్లు... వాయిద్యకారుడిగా పనిచేస్తున్నాడు. ప్రకాశం జిల్లా నుంచి ఆలయానికి పూలు తీసుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా... వరికుంటపాడు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: