ETV Bharat / state

'ఎమ్మెల్యే, జడ్పీ సీఈవోను కలిసి వస్తేనే.. జాయిన్ చేసుకుంటానన్నారు' - వింజమూరు ఎంపీడీవోపై ఆఫీస్ సబార్డినేటర్​ శిరీష ఆరోపణలు

Vingamur mpdo office News: నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీడీవో స్వరూప రాణి.. తనను డ్యూటీలో జాయిన్​ చేసుకోవడంలేదని ఆఫీస్ సబార్డినేటర్​ శిరీష ఆరోపించారు. ఎమ్మెల్యే, జడ్పీ సీఈవోను కలసి వస్తేనే.. తన జాయినింగ్​ లెటర్​ తీసుకుంటానని ఇబ్బంది పెడుతున్నారని కార్యాలయం ఎదుట శిరీష కన్నీరు పెట్టుకున్నారు.

Office Subordinate Sirisha
Office Subordinate Sirisha
author img

By

Published : Jul 6, 2022, 11:04 PM IST

Office Subordinate Shirisha protest at MPDO Office: నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీడీవో కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్​ శిరీషకు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీడీవో స్వరూప రాణి తీరును నిరసిస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తనను ఎంపీడీవో చిన్నచూపు చూస్తున్నారని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ కన్నీరు పెట్టుకున్నారు. వరికుంటపాడు ఎంపీడీవో కార్యాలయంలో ఏడేళ్లుగా ఆఫీస్ సబార్డినేటర్​గా పత్రి శిరీష పనిచేశారు. జూన్ 30న సాధారణ బదిలీల్లో భాగంగా ఆమెను వింజమూరు ఎంపీడీవో కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Vingamur mpdo

ఈ నేపథ్యంలో రిలీవింగ్ లెటర్, జాయినింగ్ లెటర్​తో ఎంపీడీవో స్వరూప రాణిని కలవగా.. జాయినింగ్​ లెటర్ తీసుకోవడానికి నిరాకరించిందని శిరీష తెలిపారు. భర్త లేని మహిళగా నన్ను ఎంపీడీవో చిన్న చూపు చూస్తూ.. నిందలు వేసి జాయిన్​ చేసుకోవడంలేదని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, జడ్పీ సీఈవోను కలసి వస్తేనే.. జాయినింగ్​ లెటర్​ తీసుకుంటానని ఎంపీడీవో అంటున్నారని ఆరోపించారు. ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.