NTR Necklace Road Park Condition in Nellore : నెల్లూరు నగరంలోని లక్షలాది మంది ప్రజల కోసం అద్భుతంగా నిర్మాణం చేసిన ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు పార్కు నేడు నిర్జీవంగా మారింది. అహ్లదకరమైన వాతావరణం పంచాల్సింది పోయి.. వ్యర్థాలతో దుర్గంధంగా మారింది. తెలుగుదేశం పాలనలో, పురపాలక శాఖ మంత్రిగా నారాయణ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా ప్రజల కోసం.. చక్కటి పార్కును, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును అభివృద్ధి చేశారు.
'పర్యాటక రంగంలో రూ.2,868 కోట్లపెట్టుబడులు'
Current Condition of NTR Necklace Road Park : టీడీపీ హయాంలోనే ఆరు కోట్లు దీని కోసం ఖర్చు చేశారు. రెండు కిలోమీటర్ల పొడవున సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అలాగే.. స్వర్ణాల చెరువు, పక్కనే ఇరుకళల పరమేశ్వరీ ఆలయం, సమీపంలోనే జొన్నవాడ, నరసింహకొండ ఆలయాలకు పర్యాటకులు వెళ్లేలా ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఎంతో అద్భుతంగా స్వాగత ద్వారం, ట్యాంక్ బండ్ మీద జాతీయ నాయకుల విగ్రహాలు, స్నానాలకు గణేష్ ఘాట్‌ను అభివృద్ధి చేశారు.
TOURISM: ఇతర రాష్ట్రాలు, విదేశీ పర్యటకులను ఆకర్షించేలా ప్యాకేజీలు: మంత్రి అవంతి
Funding for NTR Necklace Road Park : కాని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు అభివృద్ధిని గాలికి వదిలేసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోపాలను సాగుగా చూపి నాలుగున్నరేళ్లుగా పనులు నిలిపివేశారని మండిపడుతున్నారు. పురపాలకశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే నెక్లెస్ రోడ్డు పార్కు ప్రాంతం.. చెత్తా చెదారంతో నిండిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం పర్యాటకులు వచ్చేందుకు వీలు లేకుండా పోయింది. అలాగే విగ్రహాలు పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అనైతిక కార్యక్రమాలకు నిలయంగా మారి ప్రజలు అటు వైపు వెళ్లలంటే భయపడే పరిస్థితి నెలకొంది. పచ్చదనం కనుమరుగై.. మహిళలు, కుటుంబ సభ్యులు రాలేని విధంగా నెక్లెస్ రోడ్డు మారిందని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో అధ్వానంగా దర్శనమిస్తున్న పార్కులు - పట్టించుకోని వీఎంసీ అధికారులు
Present Situation of Parks in AP : రోడ్లు పూర్తిగా దెబ్బతిని.. పలు నిర్మాణాలు శిథిలావస్థకు చేరి.. కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పోలీసులు అధికారుల పర్యవేక్షణ లేక పోవటం వల్ల ప్రస్తుతం ఆ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎన్టీఆర్ నక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువు అభివృద్ధికి రూ.17.50 కోట్ల టెండర్లు పిలిచారు. కానీ నిధులు మంజూరు చేయాలన్న విషయాన్ని మరిచిపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గతంలోనూ స్వయంగా కార్యాలయానికి వెళ్లి ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితిపై సంబంధిత అధికారులకు వినతిపత్రం అందించారు. జీవో నెంబర్ 45 ప్రకారం క్లియరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువును అభివృద్ధి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.