నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘ కార్యాలయంలో అభివృద్ధి పథకాల అమలుపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వెంకటగిరి, దక్కిలి, బాలాయపల్లి మండలాల్లో తాగునీటి సమస్యలపై చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రజలు మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: గురువారం కృష్టానదీ యాజమాన్య బోర్డు సమావేశం