నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు-బసవరాజుపాలెం గ్రామాలకు వేసిన రోడ్డు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. సుమారు రూ.కోటి 70 లక్షల వ్యయంతో 4 నెలల కిందట మహిమలూరు నుంచి బసవరాజుపాలెం వరకు రోడ్డు వేశారు. అప్పుడే రోడ్డు మొత్తం కంకరు తేలుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. పనులు చేసే సమయంలో గుత్తేదారులను ప్రశ్నించినా... తమ మాటను లెక్క చెయ్యలేదని ఆరోపించారు.
కనీస నియమాలు పాటించకుండా... తమలపాకు మందమైన తారు వెయ్యలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామానికి సరైన రహదారులు లేక నానా ఇబ్బందులు పడ్డామని... ఇప్పుడు వేసిన రోడ్డు ఇలా 4 నెలలకే దెబ్బతినడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: అధ్వానంగా విజయవాడ-రాజమహేంద్రవరం జాతీయ రహదారి