జగన్మోహన్రెడ్డిని ప్రజలు ఎంతో ఆదరించి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారని నెల్లూరు గ్రామీణ తెదేపా ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ అన్నారు. కానీ జగన్మోహన్రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ప్రజా వ్యతిరేక పనులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధానికి కేటాయించిన భూములను పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇస్తానని ప్రకటించడం మంచిది కాదన్నారు. అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తే ఎంతోమంది పేదలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే చుట్టుపక్కల ఎంతో భూమి ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రాంతాల మధ్య గొడవలు పెడుతున్నారని విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఇదీ చూడండి: విశాఖలో చంద్రబాబు వాహనశ్రేణిని అడ్డుకున్న వైకాపా