Kotamreddy Sridhar Reddy Comments: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తాను ఖరాఖండిగా ఉంటానని, నా అనుకునే వాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదని.. ఓ సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. అనేక సార్లు రాజకీయంగా అవకాశాలు వచ్చినా.. జిల్లాలోని పెద్ద కుటుంబాలు తన గొంతు నొక్కేశారని అన్నారు.
కొన్ని కుటుంబాలు.. వాళ్ల కొడుకులు, బావ మరుదులు, ఆఖరికి పుట్టబోయే మనవళ్లు కూడా ఎమ్మెల్యేలుగా ఉండాలనుకుని.. తన ఎదుగుదలను అడ్డుకున్నారన్నారు. అయినా వెన్ను చూపకుండా.. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగానని తెలిపారు. సీట్ల వద్దకు వచ్చేసరికి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు పెద్ద కుటుంబాలకు.. ఓట్లు మాత్రం సామాన్యులివా అని ప్రశ్నించారు. ఇకపై వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి వలనే.. ప్రజలకు సేవ చేయగలిగానని.. ఇకపై కూడా చేస్తానని అన్నారు.
ఇవీ చదవండి: