నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా రైతు సంఘం నాయకులు కలిశారు. జిల్లాలో వరి 3 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌కు వివరించారు. గత రబీ సీజన్లో జిల్లాలో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా... ప్రభుత్వం కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు చెప్పారు. మిగిలిన ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. రెండో పంట సీజన్లో అయినా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రస్తుతం వరి కోతలు మొదలు అవుతున్నాయని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
'ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి' - నెల్లూరు జిల్లా రబీ సీజన్ తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా రైతు సంఘం నాయకులు కోరారు. గత రబీ సీజన్లో ప్రభుత్వం తక్కువ ధాన్యం కోనుగోలు చేయటంతో మిగిలిన ధాన్యాన్ని దళారులకు అమ్ముకుని తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, జిల్లా రైతు సంఘం నాయకులు కలిశారు. జిల్లాలో వరి 3 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌కు వివరించారు. గత రబీ సీజన్లో జిల్లాలో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా... ప్రభుత్వం కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు చెప్పారు. మిగిలిన ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. రెండో పంట సీజన్లో అయినా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రస్తుతం వరి కోతలు మొదలు అవుతున్నాయని, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.
ఇదీ చూడండి: నిబంధనల మేరకే సరస్వతీ పవర్ లీజు గడువు పెంపు
TAGGED:
నెల్లూరు జిల్లా తాజా వార్తలు