ఇళ్లను లూటీ చేసే ఇద్దరు కరుడు గట్టిన దొంగలను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.50 లక్షలు విలువ చేసే ఒకటిన్నర కేజీల బంగారు, మూడున్నర కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో జరిగిన చోరీ కేసులను ఛేదించే క్రమంలో ప్రకాశం జిల్లా పొదిలి మండలానికి చెందిన తిరుపతి స్వామి, చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలానికి చెందిన లక్ష్మీ పతులను నెల్లూరులో అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన అనంతరం వీరు పలు జిల్లాల్లో 21 చోరీలు చేసినట్లు గుర్తించామని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు. తిరుపతి స్వామి 2015 నుంచి 80 నేరాలు చేశాడని... రెండుసార్లు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నాడని వివరించారు.
ఇదీ చూడండి: