Nellore Mayor Potluri Sravanthi: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్ల ఈ స్థాయిలో ఉన్నాను.. కార్పొరేటర్‌గా గెలిచాను.. మేయర్ స్థాయికి వచ్చానని నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి స్పష్టం చేశారు. శ్రీధర్ అన్నతోనే తన రాజకీయ ప్రయాణమని ఆమె అన్నారు. వెంటనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చలించి.. ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎటుపోయినా.. మేము నీకు అండగా ఉంటాం.. అవసరమైతే నెల్లూరు నగర మేయర్ పదవికీ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎటువెళ్లినా నీ వెంటే ఉంటామని చెప్పారు. మా జెండా.. మా ఊపిరి శ్రీధర్ అన్న. ఆయన వెంటే నడుస్తామని నెల్లూరు నగర మేయర్ ప్రకటించారు.
అన్న.. నీతోనే నా రాజకీయ ప్రయాణం.. శ్రీధర్ అన్నతోనే మేయర్ స్థాయికి ఎదిగా...రుణపడి ఉంటాం.. అవసరమైతే రాజీనామాకు సిద్ధం..ఎటువెళ్లినా నీ వెంట ఉంటాం . మా జెండా.. మా ఊపిరి శ్రీధర్ అన్న. ఆయన వైపే ఉంటాం. ఆయన వెంటే నడుస్తాం. నెల్లూరు నగర మేయర్, పొట్లూరి స్రవంతి
MLA KOTAMREDDY COMMENTS ON PHONE TAPPING : అనుమానించిన చోట ఉండకూడదని భావించి నీతిగా, నిజాయతీగా తన అధికారాన్ని వదులుకున్నానని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆఖరి దాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని.. కానీ తాను అలా చేయలేదన్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదని.. విద్యార్థి నేతగా మొదలు 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో ఉన్నవాడినన్నారు. తన మనసు విరిగిందని.. ప్రాణాతి ప్రాణంగా ఆరాధించిన జగన్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని ఆధారాలు చూపించి బయటకు వచ్చినట్లు తెలిపారు. ఆఖరి దాకా ఉండి మోసం చేయలేదని.. నెల ముందు వరకు నాకు ఎలాంటి ఆలోచనలు లేవన్న కోటంరెడ్డి.. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికాక దూరం జరిగినట్లు వెల్లడించారు.
దాదాపు 10 మంది మంత్రులు, రీజినల్ కోఆర్డినేటర్లు, సలహాదారులు నాపై ఎలా మాట్లాడారో అందరికీ తెలుసన్నారు. ఆ తర్వాత సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే తన వద్ద ఉన్న ఆధారం బయటపెట్టినట్లు తెలిపారు. ట్యాపింగ్‌పై విచారణ జరపండి అని కోరినట్లు తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేదని.. ప్రజలు ఆమోదించేవారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫోన్ ట్యాపింగ్ ఆషామాషీగా జరగదని అని కోటంరెడ్డి అన్నారు.
ఇవీ చదవండి: