నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో భాగంగా ప్రభుత్వం వేటు వేసింది. సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభాకర్.. వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపుల విచారణ నివేదిక ఇంకా రానందున సర్కార్ తాత్కాలిక చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ప్రభాకర్‌ను తొలుత తిరుపతి రుయాకు బదిలీ చేసిన ఉన్నతాధికారులు.. అనంతరం కర్నూలు జీజీహెచ్‌కు బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.
కర్నూలుకు బదిలీ..
వైద్యవిద్యార్ధినిపై వేధింపుల ఘటనలో నెల్లూరు జీజీహెచ్ సూపరిండెంట్, వైద్య కళాశాల జనరల్ సర్జరీ విభాగాధిపతి ప్రోఫెసర్ ప్రభాకర్ జెనాను ప్రభుత్వం కర్నూలుకు బదిలీ చేసింది. ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ రాధాకృష్ణ రాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఇవీ చూడండి : Audio viral: నెల్లూరు జీజీహెచ్‌లో లైంగిక వేధింపుల కలకలం
ఇవీ చూడండి : నెల్లూరు జీజీహెచ్ ఘటనపై మహిళా కమిషన్ ఆగ్రహం...దర్యాప్తునకు ఆదేశం!
ఇవీ చూడండి : sexual harassment: వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. ప్రభుత్వం సీరియస్