ETV Bharat / state

వేతనాలు లేక ఇబ్బందుల్లో నెల్లూరు జీజీహెచ్‌ భద్రతా సిబ్బంది

లాక్​డౌన్ వేళ నెల్లూరు జీజీహెచ్‌ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది పస్తులు ఉండాల్సి వస్తోంది. ఏడు నెలల నుంచి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు.

జీతాలు లేక నెల్లూరు జీజీహెచ్‌ ఆసుపత్రి భద్రతా సిబ్బంది ఇక్కట్లు

author img

By

Published : May 19, 2020, 5:29 PM IST

నెల్లూరు జీజీహెచ్‌ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది వేతనాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా నియమించిన సిబ్బందికి ఏడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ముందు వాహనాల పార్కింగ్‌ దగ్గర నుంచి క్వారంటైన్ కేంద్రాల భద్రత వరకు నిరంతర సేవలందిస్తున్న తమను గుర్తించి ఆదుకోవాలని సెక్యూరిటీ సిబ్బంది కోరుతున్నారు. సకాలంలో జీతాలు చెల్లించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

జీతాలు ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.